ప్రేమ పెళ్లి చేసుకుందని దారుణమైన శిక్ష విధించిన గ్రామస్తులు

ప్రేమ పెళ్లి చేసుకుందని దారుణమైన శిక్ష విధించిన గ్రామస్తులు

0
92

ఈ టెక్నాలజీ యుగంలో కూడా కులాలు మతాలు వివక్షలు చాలా విషయాలలో అడ్డంకులు అవుతున్నాయి.. అంతేకాదు ప్రేమ పెళ్లి చేసుకునే సమయంలో ఈ అడ్డంకి వల్ల ప్రాణాలు కూడా తీస్తున్నారు, అసలు మా కులపు అమ్మాయిని పక్క కులం వాడు పెళ్లి చేసుకోవడానికి కుదరదు అనేలా కుల సంఘాలు కూడా కొన్ని అడ్డుకుంటున్న ఘటనలు ఉన్నాయి.

అయితే ప్రేమ వివాహాల విషయంలో కొందరు ప్రేమికులని చంపుతున్న సంఘటనలు ఉన్నాయి ఉదాహరణకు ప్రణయ్ హత్య అనే చెప్పాలి అయితే తాజాగా మరో దుర్మార్గం జరిగింది. ఓ అమ్మాయి వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంది దీంతో గ్రామస్తులు వారిద్దరిని గ్రామం నుంచి వెలివేశారు, గ్రామ పెద్ద ఈ శిక్ష విధించాడు.

దీంతో పెళ్లి కుమారుడి తండ్రి… తమ గ్రామ పెద్దలను బతిమిలాడుకున్నాడు. ఒప్పించి సమస్య పరిష్కారం కోసం పంచాయతీ పెట్టించాడు. అయితే ఆమె వేరే కులం కాబట్టి ఆమెని శుద్ది చేయాలి అని చెప్పి ఆవుమూత్రం పేడ తాగించి తినాలి అని తీర్పు ఇచ్చారు.. అంతేకాదు అలా ఆమె పెళ్లి చేసుకుంది కాబట్టి ఐదు లక్షలు జరిమానా వేశారు, దీంతో పెళ్లి కుమారుడు పోలీసు కేసు పెట్టాడు , ఇప్పుడు ఈ ఊరిపెద్ద జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు