ఆ దేవుడ్ని నమ్ముకుంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు అంటారు.. నిజమే మన ప్రయత్నం మనం చేయాలి, అయితే ఏ ఇబ్బందులు లేకుండా ఏ పని చేసినా విఘ్నాలు లేకుండా చూడాలి అని ఆ వినాయకుడ్ని మనం కోరుకుంటాం, అయితే కచ్చితంగా ఇంట్లో వినాయకుడి ఫోటో ఉంటుంది, ఏ పని కార్యక్రమం మొదలు పెట్టినా వినాయకుడి ప్రతిమ ఉండాల్సిందే.
అయితే వాస్తు ప్రకారం వినాయకుడి విగ్రహం లేదా ఫోటోని పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ మరింత పెరుగుతుంది అంటున్నారు పండితులు, ముఖ్యంగా స్వస్తిక్ కలిసి ఉండే విగ్రహాన్ని లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి.
ఇలా చేస్తే వ్యాపార వృద్ది ఇంటికి విజయం కలుగుతాయి, అదే ఆఫీసుల్లో నిలబడి వుండే వినాయకుని విగ్రహాన్ని వుంచాలి. తొండం ఆయన ఎడమ చేతివైపు తిరిగి ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వుంచితే అదృష్టం వరిస్తుంది. కారులో కూడా క్రిస్టల్ వినాయకుడి విగ్రహాలు పెట్టుకుంటే మంచిది పాజిటీవ్ ఎనర్జీ వస్తుంది.. తెలుపు వర్ణంలోని వినాయకుడి విగ్రహాన్ని అరచేతిని మించింది కాకుండా తీసుకోండి.. దీని వల్ల ఐష్ట ఐశ్వర్యాలు వస్తాయి. ఇక వినాయక విగ్రహాన్నీ పూజ గదిలో పెట్టుకోవచ్చు, అడుగు దాటిన విగ్రహాం ఉంటే కచ్చితంగా రోజూ ఆ వినాయక విగ్రహానికి పూజ చేసి నైవేధ్యం పెట్టాలి.