విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం…

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం...

0
127

తాజాగా విశాఖ జిల్లా ఎలమంచిలి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరోక యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు….

విశాఖ నుంచి పెద్దాపూరం వైపు వెళ్తున్న బైక్ జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ ను ఢీ కొట్టింది…దీంతో వారు కిందపడిపోయారు. తీవ్ర గాయాలు అయిన ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు…

మరో యువకుడుకి తీవ్ర గాయాలు అయ్యాయి.. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు… కాగా ఈ దారుణం ఉదయం 9 గంటల సమయంలో జరిగినట్లుగా తెలుస్తోంది…