విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎలా అయ్యారో తెలుసా చరిత్ర

విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎలా అయ్యారో తెలుసా చరిత్ర

0
94

విశ్వామిత్రుడు ఎంతో గొప్ప వ్యక్తి, ఘొర తపస్సులు చేసిన మహామనిషి, అయితే ఆయన బ్రహ్మర్షి ఎలా అయ్యారు అనేది చూద్దాం..విశ్వామిత్రుడు ఓరోజు తూర్పు దిక్కుకు వెళ్ళి మౌనంతో కామక్రోధాలను నిగ్రహిస్తు ఎంతో శ్రద్దతో తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇలా వెయ్య సంవత్సరాలు ఆయన తపస్సు చేశారు, ఈ సమయంలో ఆయన శ్వాస తీసుకోకుండా ఘోర తపస్సు చేశారు, ఇలా ఉండటం వల్ల ఆయన చాలా సన్నగా మారిపోతారు.

ఇలాంటి సమయంలో ఆయన ఓ రోజు అన్నం తిందాము అని భావించి కూర్చుంటాడు, ఈ సమయంలో ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి భిక్ష అడుగు తాడు. విశ్వామిత్రుడు అది గ్రహించి ఇంద్రుడుకి తాను తిన బోయే అన్నాన్ని ఇచ్చేస్తాడు. మళ్లీ తపస్సు చేయడం మొదలుపెడతాడు.

అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షం అవుతారు.. బ్రహ్మను ఒకకోరిక కోరుతాడు. వశిష్ఠుని చేత బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉంది అంటాడు. అప్పుడు దేవతలు వశిష్ఠుడి దగ్గరకు వెళ్ళి విశ్వామిత్రుడి కొరిక చెబుతారు.వశిష్ఠుడు విశ్వామిత్రుడి కోరిక మేరకు బ్రహ్మర్షి అని పిలిస్తే విశ్వామిత్రుడు సంతోషిస్తాడు.. ఆ విధంగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుతాడు.