హిందూ వివాహా ఆచారాల్లో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇద్దకూ ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు.. దీంతో వివాహం అయినట్లు లెక్క తాళికంటే ముందు ఈ జీలకర్ర బెల్లం అనేదే వివాహానికి ముఖ్యఘట్టం.
అయితే తెలుగు పెళ్లిల్లలో సుముహూర్తం అంటే జీలకర్ర, బెల్లం పెట్టే సమయమే అంటారు. అందు కోసమే ఆ తంతు జరిపే సమయంలో మంగళప్రదమైన మంత్రాలను చదువుతారు పండితులు. ఇలా ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకుంటూ తలపై జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు.
ఎప్పుడైనా ఇద్దరూ జీలకర్ర బెల్లం పెట్టుకుంటారో అప్పుడు ఇద్దరి మధ్య నుంచి అప్పటి వరకూ ఉన్న తెరను తీస్తారు. జీలకర్ర, బెల్లాన్ని పెట్టి ఉంచగానే ఒకరి కనుబొమ్మల మధ్య భాగాన్ని మరొకరు చూసుకోవాలని చెబుతూ తెరని తొలగిస్తారు.
ఈ జీలకర్ర, బెల్లం రెండింటి కలయికలో ఓ అద్భుతమైన శక్తి విడుదల అవుతుందని చెపుతారు. వారిద్దరి మధ్య మంచి బలం ఏర్పడుతుంది అని చెబుతారు, అందుకే ఇలా జీలకర్ర బెల్లం పెట్టగానే సగం వివాహ తంతు అయినట్లే తర్వాత తాళికట్టాక పూర్తిగా వివాహ తంతు పూర్తి అయినట్లు లెక్క.