వివేకా హత్య కేసుపై బీటెక్ రవి కామెంట్స్

వివేకా హత్య కేసుపై బీటెక్ రవి కామెంట్స్

0
92

వివేకా హత్య కేసుపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు ఓ కొలిక్కి వస్తుంది అని అనుకున్నారు.. కాని ఇంకా ఈ కేసుపై ఎలాంటి నిజా నిజాలు బయటపడలేదు, అయితే తాజాగా వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ మరికొన్ని రోజుల్లో వీడుతుంది అని చెబుతున్నారు ఆయన సన్నిహితులు, ఎందుకు అంటే పోలీసులు సిట్ విచారణ వేగవంతంగా జరుగుతోందట.

తాజాగా సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. ఆయనను దాదాపు ఐదు గంటలపాటు సిట్ దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. దీనిపై బీటెక్ రవి మాట్లాడారు, సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. అయితే ఆయన హత్య కేసుకు సంబంధించి తన దగ్గర సమాచారం ఉంటుంది అని అనుకున్నారని, తాను వారికి అన్నీ విషయాలు చెప్పాను అన్నారు. అంతేకాదు ఇటీవల మరణించిన శ్రీనివాసరెడ్డి ఘటనపైనా ఆరా తీశారని బీటెక్ రవి వివరించారు.

వివేకా హత్య జరిగిన రోజు ఎక్కడ ఉన్నారు? వివేకా హత్య సమాచారం ఎలా తెలిసింది? అంటూ ప్రశ్నించారని తెలిపారు. ఎప్పుడు సిట్ అధికారులు పిలిచినా వస్తాను అని చెప్పారు రవి.. ఈకేసులో నిందితులు ఎవరో తేల్చాలి అని, దోషులని శిక్షించి, నిర్దోషులు బలవ్వకుండా చూడాలి అని తెలియచేశారు బీటెక్ రవి.