ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా? బ్యాంక్ అదిరిపోయే ఆఫర్!

Want to build a house? Bank creepy offer!

0
113

మీరు ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారా..? అయినప్పటికీ అవ్వలేదా..? చాలా మంది సొంతింటి కల సాకారం చేసుకోవాలని అనుకుంటూ వుంటారు. అలా అనుకునే వాళ్లందరికీ ఇది గుడ్ న్యూస్. ఒక బ్యాంక్ అదిరిపోయే ఆఫర్ తీసుకు వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ తాజాగా హోమ్ లోన్ కస్టమర్ల కోసం మంచి ఆఫర్ ని తీసుకు రావడం జరిగింది. తక్కువ వడ్డీకే లోన్స్ ని ఇస్తోంది. సొంతింటి కలని సాకారం చేసుకోవడానికి ఇదే మంచి సమయం. వడ్డీ రేటు 6.65 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. పైగా ఎంతో ఈజీగా ఈ లోన్ వస్తుంది అని బ్యాంక్ అంది.

పైగా ఆన్‌లైన్ అప్లై ఫెసిలిటీ కూడా ఉందని కెనరా బ్యాంక్ తెలిపింది. ఇది ఇలా ఉంటే ఇది పరిమితి కాల ఆఫర్ మాత్రమే. అంటే కొన్ని రోజులు పాటే ఈ తక్కువ వడ్డీ రేటు తో లోన్ పొందే అవకాశం ఉంటుంది. కనుక కావాలంటే త్వరగా లోన్ కోసం అప్లై చెయ్యండి. హోమ్ లోన్ మాదిరిగానే కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ వంటివి కూడా ఇస్తోంది బ్యాంక్. హోమ్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ కూడా ఉంటుంది.