టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే అద్భుతమైన ఫీచర్స్ ఉన్న కొత్త టీవీ వచ్చేస్తుంది..

0
101

ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ ఇప్పటికే అద్భుతమైన ఫీచర్స్ ఉన్న ఫోన్ లను మనకు పరిచయం చేసి మనల్ని ఆనందపరిచాయి. కేవలం ఫోన్లే కాకుండా ప్రస్తుతం తమ దృష్టిని టీవీలపై కేద్రీకరించి రియల్ మీ ఇప్పుడు అద్భుతమైన టీవీ లను కూడా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రియల్ మీ కంపినికి చెందిన టీవీలు కొనడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతూ కొనడానికి మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం రియల్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ ఎఫ్‌హెచ్‌డీ అనే కొత్త టీవీని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ రియల్ మీ కంపిని చక్కని శుభవార్త చెప్పింది. 40 ఇంచుల, 43 ఇంచుల ఉండడంతోపాటు ఈ టివిలు బెజిల్‌లెస్ డిజైన్‌లో వస్తున్నాయి.

ఇక ధర విషయానికి వస్తే 25,999 నుండి రూ.22,999 వరకు ఉండే అవకాశం ఉంది. ఇంకా ఈ టివిలు 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా టీవీ లో మనకు కావలసిన యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకునే చక్కని వెసులుబాటు కూడా కల్పిస్తుంది.