ఈ మధ్యకాలంలో టాయిలెట్‌లోనూ, బస్‌స్టేషన్‌లోనూ, ప్రభుత్వ ఆస్పత్రిలోని బాత్‌రూంలోనూ అనుకోకుండా ప్రసవం జరగడం గురుంచి మనం వినే ఉంటాం కదా. అచ్చం అలాంటి సంఘటన యూకేలో జరిగింది.
యూకేకి చెందిన కైట్లిన్ ఫుల్లెర్టన్, సెర్గియో అనే దంపతులు కారులో సరదాగా బయటకు వెళ్లారు. అనోకోకుండా కైట్లిన్‌కి టాయిలెట్ రావడంతో సమీపంలో ఎలాంటి పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లోని బాత్‌రూంలోకి వెళ్లింది.
అనుకోకుండా ఆమెకు నొప్పులు మొదలై కేవలం 10 నిమిషాల్లోనే ప్రసవం అయిపోయింది. అంతేకాదు చక్కని మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా ఏం చేయాలో తోచదు. అక్కడే ఉన్న కొంత మంది మహిళల సాయంతో విషయం తన భర్తకు తెలియజేయడంతో వెంటనే కైట్లిన్ భర్త సెర్గియో వస్తాడు. ఆ తర్వాత ఆమె భర్త సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. తల్లి బిడ్డలు సురక్షింతంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి.
https://www.youtube.com/watch?v=Oz4K-s6DEsY