నేనేమి చేశాను పాపం..తల్లిని రోడ్డున పడేసిన కసాయి కొడుకు

0
95

అమ్మను మించిన దైవం లేదంటారు. కానీ కొంతమంది కొడుకులు కన్నతల్లి పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారు. కని పెంచిన బిడ్డే పెద్దయ్యాక పట్టించుకోకపోవడంతో ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం. ఇక తాజాగా కర్ణాటకలో ఓ కొడుకు తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.

కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల్ హులిగెమ్మ గుడి ఆవరణలో ఖాసీంబీ అనే తల్లిని  కొడుకు వదిలేశాడు. అంతేకాదు ఆమెకు సిమ్ కార్డ్ లేని మొబైల్ ఫోన్ చేతిలో పెట్టాడు కొడుకు. గుడి ఆవరణలో ఉన్న ఆ వృద్దురాలు ఆకలితో అలమటించింది.

విషయం తెలుసుకున్న సీనియర్ సిటిజన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఆమెను వృధాశ్రమంలో చేర్పించారు. కనికరం లేకుండా వృద్ధురాలిని గుడి ఆవరణలో వదలి వెళ్లిన కొడుకును అరెస్టు చేయాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి ఘటనలు మానవత్వానికే మచ్చ తెస్తున్నాయి. పేగు తెంచుకొని పుట్టిన కొడుకే కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి పట్టించుకోకపోవడంతో ఆ తల్లికి నరకవేదన మిగిలింది.