ఇంట్లో నెమలి ఈకలు ఉండడం వల్ల కలిగే లాభాలివే?

0
106

సాధారణంగా నెమలికలను చూడగానే మనకు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. అవి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనబడతాయి. వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బల్లులు రాకపోవడం: నెమలీకలు ఉన్నచోటకి బల్లులు రావు. గోడలపై నెమలీకల గుత్తిని తగిలిస్తే బల్లులు, ఇతర కీటకీలు మీ ఇల్లు వదిలిపారిపోతాయి.

సంపద పెరుగుతుంది: ఇంట్లో సంపద పెరగాలంటే నెమలికన్నులను తెచ్చి మీరు డబ్బులు దాచే చోట పెట్టుకోవాలి. ఇది సంపదను పెంచడమే కాదు, ఆ సంపదకు స్థిరత్వాన్ని ఇస్తుందని పెద్దల నమ్మకం.

గాయాలను నయం చేయడం: గాయాలను సమర్థవంతంగా నయం చేయడంలో నెమలీకలు ముందుంటాయి. గాయాల మీద కట్టులా కడితే మంచి ఫలితం ఉంటుంది. శరీరం నుంచి విషాన్ని తొలగించగల శక్తి కూడా దీనికి ఉంది.