అర్ధరాత్రి నడిరోడ్డుపై తల్లి, కూతురు..అసలేం జరిగిందంటే?

0
135

అర్ధరాత్రి నడి రోడ్డుపై కారు పంక్చర్ అయింది. కారులో ఉన్నది కేవలం ఓ తల్లి, ఆమె కూతురు. చుట్టూ చిమ్మ చీకటి. తోడుగా ఇంకెవ్వరూ లేరు. కారు దిగి పంక్చర్ వేద్దామంటే భయం. కారులోనే ఉండిపోదామంటే తెల్లవార్లు అలా ఉండడం కష్టం. దైర్యం చేసి కారు దిగితే ఏదైనా అఘాయిత్యం జరిగినా అరిచి గీ పెట్టినా వినిపించుకునే నాధుడుండడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలి? సరిగ్గా అదే చేశారు, ఆ తల్లీ, కూతురు.

వారికి కలిగిన భయం నుండే ఓ అద్భుతమైన ఆలోచన కలిగింది.ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి నెల్లూరు వైపుగా తన కూతురుతో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ప్రయాణిస్తుంది. ప్రయాణంలో భాగంగా వెళ్తుండగా అర్థరాత్రి కారు పంక్చర్ అయింది. దీనితో వారిలో భయం కలిగింది. నడిరోడ్డుపై కారు ఆగిపోయింది. ముందుకు వెళదామంటే వెళ్లలేని పరిస్థితి. సహాయం కోరుదామంటే వారి నుండే ఏదైనా ముప్పు పొంచి ఉందనే అనుమానం. తెలియని ప్రదేశం కాకపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.

బాగా ఆలోచించారు. కొద్దిసమయానికి వారు తేరుకుని దిశా యాప్ SOS కాల్ చేశారు. కేవలం 10 నిమిషాల్లో చిన మర్రిపాడు పోలీసులు వారి వద్దకు చేరుకొని సమస్యను పరిష్కరించారు. ఆమె కారు టైర్ మార్పించి, సురక్షితంగా గమ్యం చేరేలా సహకరించారు. ఏపీ పోలీసుల సేవలు సలాం అంటూ ఆ తల్లి, కూతుళ్ళు మర్రిపాడు పోలీసులకు కృతజ్ణ్నతలు తెలిపారు.