అలగడపలో అసలేం జరుగుతుంది?

0
94

తెలంగాణలో  ఆహార పరిశ్రమల ఏర్పాటుకు సర్కార్ పూనుకుంది. అందులో భాగంగా ఆంద్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన మిర్యాలగూడ    నియోజకవర్గo  దామరచర్ల  దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిలో ఏర్పాటుకు సిద్ధపడింది. కాని స్థానిక దళారి నాయకులు వ్యాపారస్తులతో కుమ్మకై మిర్యాలగూడ కు అత్యంత సమీపoలోని అలగడప లోని నిరుపేదల భూములు కాజేయడానికి ప్రభుత్వ భూమిని సాకుగా చూపి (వాటిని వదిలేసి) పేదల భూమిని లాక్కోవడానికి ప్రకటన చేసింది.

గత సెప్టెంబర్ లో ప్రజల తిరుగుబాటుతో విరమించుకుంటున్నట్లు ప్రకటన చేయడమే కాకుండ పరిశ్రమల స్థలాల కేటాయింపు కోసం టెండర్లు వేసిన వ్యాపారస్తులకు గత నెల డిపాజిట్ డబ్బులు కూడా వాపస్ ఇచ్చింది. కానీ స్వార్ధపరులైన బినామీలతో భూ దందాలు చేస్తున్న  ప్రజాప్రతినిధులు తాము అగ్గువకు కాజేసిన భూములను ఎక్కువకు అమ్ముకోవడానికి మళ్ళీ తెరపైకి ఈ భూముల వివాదాన్ని తీసుకువస్తున్నారు.

ఎంత మాత్రం న్యాయసమ్మతం గాని, ఈ భూసేకరణకు ఇటు రైతుల నుండి గాని అటు ప్రజల నుండి గాని మద్దతు లేకపోవడం,  పర్యావరణ  అనుమతులు న్యాయపరమైన చిక్కులు ఉన్న ప్పటికిమొండి గా మూర్ఖంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు వ్యాపార దళారి ప్రజాప్రతినిధులు. ప్రజల పాలిట రాబందులైన ఈ నాయకులను రేపటి ఎన్నికల్లో  బొంద పెట్టి ప్రజాస్వామిక తేలంగాణ సాదించుకోవాలి.
మొన్న గౌర వెల్లిలో రైతులు, నిన్న బాసరలో విద్యార్థులు తమ దృఢసంకల్పం తో ఎవరికి బయ పడకుండా పోరాడినట్లే ఆలగడప రైతులు కూడా పోరాడి వ్యాపార దళారి నాయకులను ఎదుర్కొని తమ భూములను కాపాడుకుంటారు.

అధికారపార్టీ  నాయకుల రియల్ ఎస్టేట్ దళారి మాఫియాను తరిమికొడతారు. ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక వాదులు కోవర్టులు కానీ ప్రతిపక్ష నాయకులు అందరూ  భూ నిర్వాసితులకు మద్దతు ఇవ్వవలసిందిగా మనవి.

వేనేపల్లి పాండురంగారావు..మట్టిమనిషి