భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌..శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?

0
126

తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోడానికి భక్తులు తరలివస్తున్నారు. వర్షాలు పడుతున్న భక్తులు అధిక సంఖ్యలో రావడంతో కొంతమేర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

భక్తుల రాకతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ పూర్తిగా నిండిపోయింది.. క్యూలైను ఆస్థాన మండపం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 87,478 మంది స్వామివారిని దర్శించుకోగా, 48,692 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.53 కోట్లు వేశారు.

ఇక తాజాగా ఈరోజు తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరిగే సమావేశానికి పాలకమండలి సభ్యులు హాజరు కానున్నారు. ఇందులో టీటీడీ ఉద్యోగులకు ప్రమాదాలపై భద్రత కల్పించడం, వారందరికీ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందేలా ఏర్పాటు చేయడం, శ్రీవారి భక్తుల కోసం టైం స్లాట్‌ టికెట్లు మంజూరు వంటి వాటిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.