పోడు భూముల సమస్య తీరాలంటే ఏం చేయాలి?

0
91

పోడు వ్యవసాయం, ఆదివాసీల మీద ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్నది. అన్యాయంగా వారిపై దాష్టీకం ప్రదర్శిస్తున్నది. ఆదివాసీలకు ఏ ప్రభుత్వం కూడా సెంట్ భూమిని కొనుగోలు చేసి ఇచ్చిన దాఖలా లేదు. పోడు సాగు చేస్తున్న గిరిజనులు పట్టలేక పడుతున్న గోడు రోజూ పత్రికా శీర్షికల్లో వస్తుంది. అటవీ భూముల సాగు నిత్యం గిరిపుత్రులకు, అటవీ అధికారులకు మధ్య ఘర్షణలకు దారి తీస్తుంది. అటవీ హక్కుల చట్టం వచ్చి దశాబ్దన్నర కావస్తున్నా అందరికీ అందని హక్కు పత్రాలు.

లక్ష మందికి మూడు లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం మళ్లీ దరఖాస్తులకు అవకాశం ఇస్తే పన్నెండు లక్షల ఎకరాల పై హక్కుల కోసం రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అటవీ రెవెన్యూ శాఖల మధ్య తెగని గెట్టు పంచాయితీలు. సెటిల్మెంట్ కానీ డీముడు ఫారెస్ట్ భూములు, పూర్తి విస్తీర్ణానికి రాని హక్కు పత్రాలు

పోడు భూముల సమస్య తీరాలంటే ఏం చెయ్యాలి? పరిష్కారాలు ఏమిటి?

భూమి హక్కుల చిక్కులు లేకుంటేనే ప్రజలైనా, ప్రభుత్వమైనా ప్రగతి బాటలో సాగగలిగేది. హక్కుల చిక్కులు తొలగాలంటే మంచి చట్టాలు, సమర్థవంతమైన భూపాలన, సత్వరం సమస్యలను పరిస్కారం చేసే భూన్యాయ వ్యవస్థ ఉండాలి. భూ సుపరిపాలన ఉన్నప్పుడే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుంది. మెరుగైన భూపాలన కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి. ప్రజల భూమి సమస్యలు తీరాలంటే ఎం చెయ్యాలి అనే అంశాలపై అనునిత్యం ఆలోచిస్తూ అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలి. ఆ మేధోమధనానికి మా వంతు కృషిగా లీఫ్స్ సంస్థ తరఫున భూమికి సంబంధించిన పలు అంశాలపై వారం వారం “ భూమి సంవాద్” పేరుతో చర్చా కార్యక్రమం చేపట్టాం.

ఇందులో భాగంగా ఈ శుక్రవారం (22/07/2022) నాడు “పోడు గోడు తీరాలంటే” అనే అంశం పై ప్రముఖ భూచట్టాల న్యాయ నిపుణులు భూమి సునీల్ అధ్యక్షతన చర్చ నిర్వహిస్తున్నాం. మీరు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొని మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తెలియజేయగలరని ఆశిస్తున్నాం.

చర్చ కార్యక్రమం వివరాలు
తేదీ : 22 – 07 – 2022
సమయం: 3 PM (మధ్యాహ్నం మూడు గంటలకు)
స్థలం : 12-13-484/9/ఎ , 3 వ అంతస్తు,
రోడ్ నెంబర్ 2, 6వ లైన్, నాగార్జునా నగర్,
తార్నాక, సికింద్రాబాద్ – 17

ధన్యవాదాలతో…

జీ. జీవన్ రెడ్డి
ఉపాధ్యక్షుడు
లీఫ్స్ సంస్థ