వాట్సాప్ స్టేటస్ ప్రాణం తీసింది మరీ దారుణమైన ఘటన

వాట్సాప్ స్టేటస్ ప్రాణం తీసింది మరీ దారుణమైన ఘటన

0
96

చిన్న చిన్న వివాదాలు ఏకంగా మర్డర్ వరకూ దారితీస్తున్నాయి, తాజాగా ఓ పొలిటిషియన్ పేరున్న పార్టీలో నాయకుడు, అయితే అతని తమ్ముడు కొడుకు ఓ అమ్మాయికి పుట్టిన రోజు విషెస్ చెప్పాడు, అంతేకాదు ఆమె పేరుని ఫోటోని కలిపి వాట్సాఫ్ స్టేటస్ పెట్టాడు, ఇది అక్కడ కొందరికి నచ్చలేదు.

కొందరు యువకులు అతన్ని బెదిరించారు, ఎందుకు స్టేటస్ పెట్టావు అని ప్రశ్నించారు, ఈ సమయంలో వారందరూ ఆ యువకుడ్ని చితక్కొట్టారు, అయితే కళ్లముందు సోదరుడి కొడుకుని కొట్టడం చూసి ఆ నాయకుడు వారిని ప్రశ్నించాడు, వెంటనే కోపంతో ఆ యువకులు వీడికి నువ్వు సపోర్టా అని ప్రశ్నించారు.

రాత్రి గొడవ ఎందుకు ఉదయం మాట్లాడతాము అని చెప్పాడు, అయినా ఆ యువకులు మాట వినిపించుకోలేదు ..ఏకంగా ఆ నాయకుడి పెదనాన్నని కత్తితో పొడిచి చంపారు, దీంతో ఆయన అక్కడే మరణించాడు, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసు విచారిస్తున్నారు.