కబంధుడు ఎవరు- కబంధ హస్తాలు అని ఎందుకు అంటారో తెలుసా

Who is Kabandhu-what is Kabandha hands

0
123

రామాయణం ప్రతీ ఒక్కరూ విన్నారు చదివారు తెలుసుకున్నారు. ఈ రామాయణంలోని అనేక కథలు ఉన్నాయి, ఎన్నో పాత్రలు ఉన్నాయి. మనం కొంద‌రు మాట్లాడే సమయంలో ఒక్కోసారి ఈ మాట వింటూ ఉంటాం అది ఏమిటి అంటే కబంధ హస్తాలు అనేమాట, మీకు గుర్తు వచ్చే ఉంటుంది ఇంతకీ ఈ కబంధ హస్తాలు అంటే ఏమిటి అని చాలా మందికి అనుమానం కూడా ఉంటుంది.

కబంధుడు అనే రాక్షసుడు ఉన్నాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు సీతను వెతుకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా విచిత్ర రూపంలో ఉన్న ఓ రాక్షసుడు రామలక్ష్మణులకు ఎదురయ్యాడు. అతని శరీరం చాలా విచిత్రంగా ఉంటుంది. తల ఉండదు కాళ్లు లేవు కడుపు భాగంలో అతనికి పెద్ద నోరు ఉంటుంది. పెద్ద పెద్ద బాహువులు ఉన్నాయి. రాముడ్ని లక్ష్మణుడ్ని ఈ కబంధుడు తన హస్తాలతో బంధించి గుప్పిట్లో బిగించాడు.

వెంటనే రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడం చేతిని నరికివేయడంతో కబంధుడు నేలపై పడిపోతాడు. ఇలా తనకి ఈ శిక్ష వేసింది రాముడు అని తెలిసి చాలా ఆనందిస్తాడు. సీతాదేవి కోసం వెతుకుతున్న సమయంలో కబంధుడు సుగ్రీవుడు మీకు సహాయం చేయగలడని చెప్పి అతను ఎక్కడ ఉంటాడో తెలియచేస్తాడు. రామలక్ష్మణుల కారణంగా కబంధుడు తన శాపం పోగొట్టుకుని పాత రూపానికి వస్తాడు.