సాంప్రదాయాలకు పెట్టింది పేరు తెలంగాణ. ఈ ఆచారాలు సాంప్రదాయాలు ఇప్పుడు పుట్టినవి కాదు. కానీ తరాలు మారిన సాంప్రదాయాలను కాపాడుతున్నారు ప్రజలు. అయితే ప్రస్తుత ఆషాడ మాసంలో భార్యాభర్తలను ఒక్కచోట ఉండనివ్వరు? మరి దీని వెనక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఆషాఢ మాసంలో వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. వాతావరణం చల్లబడటం ద్వారా బ్యాక్టీరియా, వైరస్‌లు పెరిగి అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పిండానికి తొలి మూడు నెలలు చాలా కీలకమైన సమయం. ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడటం మొదలవుతుంది. ఇలాంటి సమయంలో తల్లి అంటువ్యాధుల బారిన పడితే కడుపులోని బిడ్డపై కూడా ఆ ప్రభావం పడుతుంది.
అది కాకుండా ఆషాఢంలో గర్భం వస్తే.. మండు వేసవిలో కాన్పు ఉంటుంది. అంటే ఆ ఎండ తీవ్రతను తల్లీ బిడ్డ ఇద్దరూ తట్టుకోలేరు. దీంతో ఇద్దరికీ అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఆషాఢంలో కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. అదీకాకుండా పెళ్లయిన కొత్తలో భార్యాభర్తల మధ్య విపరీతమైన ప్రేమ, ఆకర్షణ ఉంటాయి. అలాంటి సమయంలో నెల రోజుల పాటు దూరం ఉంటే.. ఎడబాటు వల్ల కలిగే బాధేంటో వారికి అర్థమవుతుంది. దీంతో వాళ్లు జీవితాంతం అన్యోన్యంగా ఉంటారని అలా చేస్తారట.