భర్తను అడ్డు తొలగిస్తే తన ప్రియుడితో కలిసి జీవించవచ్చని పక్కా ప్లాన్ వేసింది భార్య… ప్లాన్ ప్రకారం భర్తను హత్య చేసి చేతులు దులుపుకుంది… కానీ చిన్న తప్పుతో చివరకు ఆమె పోలీసులకు చిక్కింది… ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…
మేడ్చల్ మండలం సైదొని గడ్డ తండాకు చెందిన సురేష్, బబిత అనే మహిళను వివాహం చేసుకున్నాడు… ఈమెకు దుండిగల్ ప్రాంతానికి చెందినప్రేమ్ సింగ్ అనే యువకుడితో వివాహేతర సంబంధంకొనసాగిస్తోంది… దీంతో ఏలాగైనా భర్తను అడ్డు తొలగించుకుని ప్రియుడితో ఉండాలని అనుకుంది… ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది…
ప్లాన్ ప్రకారం భర్తను డీసీఎంతో ఢీ కొట్టించి అతన్ని కారులో ఆసుపత్రిలో తీసుకువెళ్తున్నట్లు నటించి దారిలో గొంతు నులిమి చంపారు… అయితే భర్య ప్రవర్తనలో అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు… కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు… విచారణలో భార్యనే ప్రియుడితో కలిసి హత్య చేశారని తేలింది… దీంతో వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు…