పెళ్లి చేసుకున్నాక కొన్ని జంటలు చాలా చిన్న కారణాలతో విడిపోతున్నారు.. కొందరు భర్తలుచేసే పనులు నచ్చక అభిప్రాయ భేదాలు వస్తే మరికొందరు భర్త టార్చర్ పడలేక విడిపోతున్నారు.. తాజాగా మహారాష్ట్రలోని పుణే నగరానికి చెందిన ఓ యువతి తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ మహిళా కమిషన్ ను ఆశ్రయించింది.
తన భర్త స్నానం చేయడని, పళ్లు తోమడని, అతడి నుంచి వచ్చే దుర్గంధం భరించలేకపోతున్నానని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. రోజుల తరబడి మురికిగా ఉండిపోతాడని తెలిపింది. అయితే మహిళా కమిషన్ కూడా ఆశ్చర్యపోయింది ఎందుకు అలాంటి పని చేస్తున్నాడు అని అడిగారు
అంతేకాదు వీరి మధ్య అన్యోన్యం లేక ఆమెకు పిల్లలు కూడా కలగడం లేదట, ఇక తనకి పిల్లలు పుడతారు అని నమ్మకం లేదు అంటోంది….ఆమె భర్త ఓ ప్లంబర్. భార్య ఫిర్యాదుతో మహిళా కమిషన్ అతడ్ని పిలిచి విచారించింది. భార్యతో కలిసి ఉండాలనే కోరుకుంటానని తెలిపాడు. అయితే కౌన్సిలింగ్ ఇచ్చారు వ్యక్తిగత శుభ్రత పాటించాలి అని చెప్పారు రెండు నెలల్లో మారకపోతే అప్పుడు విడాకులు ఇప్పిస్తాం అని చెప్పారట.