భార్యభర్తల మధ్య అడ్డొచ్చిన అక్రమ సంబంధం చివరకు ఏం జరిగిందంటే…

భార్యభర్తల మధ్య అడ్డొచ్చిన అక్రమ సంబంధం చివరకు ఏం జరిగిందంటే...

0
103

అక్రమ సంబంధం ఇద్దరు ప్రాణాలు తీసింది… ఈ సంఘటన బెంగుళూరులో జరిగింది.. బీహార్ నుంచి ఇద్దరు దంపతులు బెంగుళూరుకు వచ్చారు… అక్కడ ఒక ప్రైవేటు కంపెనీలో భర్తకు జాబ్ దొరికింది… కొన్నిరోజులకు స్థానికంగా ఒక మహిళతో ఆ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు..

ఇక ఈ విషయం భార్యకు తెలిసింది… దీంతో ఆమె భర్తను మందలించింది… అంతేకాదు ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది… తన అక్రమ సంబంధ విషయం అత్తమామలకు చెప్పి పరువుతీసిందని భర్త భార్యపై కోపం పెంచుకున్నాడు… ఆమెను ఏలాగైనా చంపెయ్యాలని అనుకున్నాడు…. అనుకున్న ప్రకారం భార్యను చంపేశాడు…

ఈ క్రమంలో కూతురితో మాట్లాడేందుకు తల్లిదండ్రులు ఫోన్ చేశారు… ఎన్ని సార్లు చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వారు బెంగుళూరుకు వచ్చారు… వారు వస్తే విషయం తెలిసిపోతుందని భయంతో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…