భార్య జ్ఞాపకాలను మర్చిపోలేక ఆమె చితి మంటల్లో దూకిన భర్త

భార్య జ్ఞాపకాలను మర్చిపోలేక ఆమె చితి మంటల్లో దూకిన భర్త

0
93
Kabul

పెళ్లి అయిన మూడు నెలలకే భార్య మృతి చెందింది….. ఇక భార్య మరణాన్ని తట్టుకోలేక పోయిన భర్త ఆమె చితిలోకి దూకి ప్రాణాలు వదిలాడు… ఈ సంఘటన మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో జరిగింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. భాంగ్రామ్ తలోధి గ్రామానికి చెందిన కిషోర్ ఖాతిక్ అనే యువకుడికి మార్చి నెలలో రుచితా చిట్టావర్ అనే యువతితో వివాహం అయింది…

ప్రస్తుతం ఆమె గర్భవతి…. ఇటీవలే ఆమె తల్లికి ఆరోగ్యం బాలేకపోవడంతో పుట్టింటికి వెళ్లింది… కొన్ని రోజుల తర్వాత కిషోర్ తన భార్యను తీసుకువచ్చేందుకు అత్తగారింటికి వెళ్లాడు… అయితే ఇంట్లో భార్య కనిపించలేదు.. దీంతో కిషోర్ బయటకు వెళ్లి ఉంటుందని అనుకున్నారు… కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ భార్య రుచితా మృత దేహం కనిపించింది…

పెళ్లి అయిన మూడు నెలలకే భార్య మరణించడంతో తట్టుకోలేక పోయిన భర్త ఆమె చితి మంటల్లో దూకాడు దీంతో అక్కడవారు అతన్ని రక్షించాడు… ఆ తర్వాత భార్య ఆత్మహత్య చేసుకున్న భావిదగ్గర కిషోర్ ఆత్మహత్య చేసుకున్నాడు… పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు రుచితాను ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…