భార్య కోరిక మేరకు హెలికాప్టర్ తీసుకువచ్చిన కొత్త పెళ్లికొడుకు – అద్దె ఎంతో తెలుసా

భార్య కోరిక మేరకు హెలికాప్టర్ తీసుకువచ్చిన కొత్త పెళ్లికొడుకు - అద్దె ఎంతో తెలుసా

0
91

పెళ్లి – సొంత ఇల్లు ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ గొప్ప విషయం, ప్రత్యేక స్ధానం ఉంటుంది… ఇక పెళ్లి విషయంలో ఎంతో ఘనంగా తన పెళ్లి జరగాలి అని కోరుకుంటారు ఎవరైనా… ఇక ఆ రోజు జరిగిన వేడుక జీవితం అంతా గుర్తు ఉంటుంది…పెళ్లి వేడుకలను మరింత కొత్తగా ప్లాన్ చేశాడు ఒక యువకుడు..

తన భార్యను హెలికాప్టర్లో సొంత ఊరికి తీసుకెళ్లి ఆశ్చర్యపరిచాడు.

 

 

మొదటిసారిగా అత్తవారి ఇంటికి వెళుతున్న ఆమె కూడా హెలీకాఫ్టర్ లో వెళ్లడంతో ఎంతో ఆనందించింది.. అయితే ఇది ఆమె కోరిక అని తెలియచేశాడు.. రాజస్థాన్లో చోటు చేసుకుంది ఈ ఘటన . భరత్పూర్ జిల్లాలోని రాయ్పూర్ గ్రామానికి చెందిన సియారామ్ గుర్జార్ అనే యువకుడు ఇటీవల పెళ్లి చేసుకున్నాడు.

 

 

ఇక తన భర్తతో కలిసి అత్తగారి ఇంటికి హెలికాప్టర్లో వెళ్లాలని వధువు భావించింది. దీంతో భార్య కోరిక మేరకు ఒక ఛాపర్ను అద్దెకు తీసుకున్నాడు. ఈ హెలికాప్టర్ అద్దెకు వరుడు రూ.7లక్షలు ఖర్చు చేయడం విశేషం. ఇక అతనిది వ్యవసాయ కుటుంబం..