భార్య లాక్ డౌన్ లో లాక్? భర్త మరో వివాహం ఇదేం దారుణం

భార్య లాక్ డౌన్ లో లాక్? భర్త మరో వివాహం ఇదేం దారుణం

0
93

కొందరు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి, అసలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో అర్దం కాని పరిస్దితి, వివాహం అయిన తర్వాత భార్యని ఎంతో ప్రేమగా చూసుకోవాలి, ఇద్దరు కుటుంబంగా కలిసి ఉండాలి, అయితే భార్య లాక్ డౌన్ వేళ చిక్కుకుపోయింది, దీంతో భార్య లేదు రావడం లేదు అనే కారణంతో మరో వివాహం చేసుకున్నాడు ఈ భర్త.

ఈ దారుణం యూపీలో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో జరిగింది. బాధితురాలు నసీమ్ కన్నీరు మున్నీరు అవుతోంది., 2013లో నయీమ్ మన్సూరీ అనే వ్యక్తితో నసీమ్ వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. లాక్ డౌన్ కు ముందు మార్చి 19న ఆమె తన తల్లిదండ్రులను చూసేందుకు పుట్టింటికి వెళ్లింది.
దీంతో వారు రావడానికి లాక్ డౌన్ ప్రకటించారు, అక్కడే ఉండిపోయారు.

ఇక ఎలాగోలా ఇంటికి రావాలి అని కండిషన్ పెట్టాడు భర్త, ఆమె రాలేను అని చెప్పింది, దీంతో
భర్తకి కోపం వచ్చింది. మరో బంధువుల అమ్మాయిని నయీమ్ మన్సూరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నసీమ్, తనకు సహాయం చేయాలంటూ కొందరిని కోరింది, , దీంతో వారు అతనిపై పోలీసు కేసు పెట్టించారు, పోలీసులే ఆశ్చర్యపోయారు.