భార్య లాక్ డౌన్ వేళ అక్క‌డ చిక్కుకుంది చివ‌ర‌కు భ‌ర్త ఏం చేశాడంటే

భార్య లాక్ డౌన్ వేళ అక్క‌డ చిక్కుకుంది చివ‌ర‌కు భ‌ర్త ఏం చేశాడంటే

0
79

ఈ వైర‌స్ మ‌హ‌మ్మారితో అంద‌రూ ఇంటికి ప‌రిమితం అయ్యారు.. దీంతో ఓ ప్రాంతానికి వెళ్లి అక్క‌డ నుంచి బ‌య‌ట‌కు రాలేక అక్క‌డ చిక్కుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు, అయితే ఓ వ్య‌క్తి భార్య ఇంటి నుంచి పుట్టింటికి సాధార‌ణంగా వెళ్లింది.. ఇక లాక్ డౌన్ కావ‌డంతో అత‌నితో ఫోన్లో మాట్లాడుతోంది.

ఈ లాక్ డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత ఇంటికి వ‌స్తాను అని చెప్పింది, ఆమె త‌ల్లిఇంట్లో క్షేమంగానే ఉంది.. కాని భ‌ర్త ఒంట‌రిగా ఉండ‌లేక‌పోయాడు, ఆమె లేక‌పోవ‌డంతో ఒంట‌రిగా ఏదో ఆలోచ‌న.. ఇలా చివ‌ర‌కు ఆమె త‌న‌తో లేదు అనే బాధ‌తో ఉరివేసుకున్నాడు.

దీంతో చివ‌ర‌కు ఆమె అక్క‌డ ఉండ‌గానే అత‌ని అంత్య‌క్రియ‌లు కూడా పూర్తి అయ్యాయి, అయితే ఆమె లేని ఎడ‌బాటు త‌ట్టుకోలేక ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు అని కుటుంబ స‌భ్యులు తెలిపారు. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.