ఒక వ్యక్తి తన భార్య కూరుని చంపిన సంఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపుతోంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… వరంగల్ జిల్లా బీఆర్ నగర్ కు చెందిన వెంకటేశ్వర్లు రమ్య దంపతులు వీరిద్దరి సంతానానికి ఎనిమిదేళ్ల కూతురు ఉంది… ఈ క్రమంలో వ్యాపారం చేసేందుకు వెంకటేశ్వర్లు అప్పు చేశాడు…
అయితే ఆ వ్యాపారం కాలం కలిసి రాకపోవడంతో నష్టాలు వచ్చాయి దీంతో ఆయన మద్యానికి బానిసయ్యడు… మద్యం మత్తులో తరుచు భార్యతో గొడవపడుతుండేవాడు… దీంతో ఆమె తన భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయింది… ఆతర్వాత భర్త తాను మారుతానంటూ తిరిగి పుట్టింటి నుంచి తీసుకువచ్చాడు… అయినా మద్యం మానలేదు. రోజు తాగివచ్చి భార్యను కొట్టేవాడు…
ఈ క్రమంలో మద్యం మత్తులో ఆమె గొంతు నులిమి చంపేశాడు… తల్లిని చంపడాన్ని చూసిందని అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల కూతురుని ప్రాణం తీశాడు… రోజు ఉదయం అయితే బయట కనిపించే రమ్య ఈరోజు మధ్యాహ్నం అయినా కనిపించకపోవడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూశారు… అక్కడ తల్లీ కూతురు శవాలుగా కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు… పోలీసులు మృత దేహాలను స్వాదీనం చేసుకుని పోస్ట్ మార్టంకు పంపించారు… రమ్య భర్తను అదుపులోకి తీసుకున్నారు…