భార్య‌ని పుట్టింటిలో వ‌ది‌లి త‌ర్వాత స్కెచ్ వేసిన భ‌ర్త

భార్య‌ని పుట్టింటిలో వ‌ది‌లి త‌ర్వాత స్కెచ్ వేసిన భ‌ర్త

0
92

మ‌హేంద‌ర్ కు 8 ఏళ్ల కింద‌ట వీణ‌తో వివాహం అయింది…. వారికి ఓ పాప ఉంది, అయితే ఏ గొడ‌వ లేకుండా ఇన్నాళ్లు కాపురం చేసుకున్నారు.. ఈ ఏడాది ఉగాదికి ముందు… ఆమెతో భర్త ఓ మాట అన్నాడు. మా బంధువుల ఇంట్లో శుభకార్యం ఉంది. నేను, మా అమ్మ వెళ్తాం. నువ్వు రావొద్దు. ఎందుకంటే కరోనా కదా. నువ్వు పాపతో వచ్చావంటే… పాపకు కరోనా సోకితే ఇబ్బంది అని చెప్పాడు.

దీంతో జాగ్రత్త కావాలి అని నువ్వు మీ ఇంటి ద‌గ్గ‌ర ఉండు అని పుట్టింటిలో దింపాడు..నిన్ను మళ్లీ తీసుకొస్తాను అన్నాడు. ఆమె ఇంటిలో బాగానే ఉంది భ‌ర్త వ‌స్తాడు అని ఎదురుచూసింది వారం అయినా అత‌ను రాలేదు.

ఫోన్ స్విఛ్ ఆఫ్ వెంట‌నే అత్త‌గారి ఇంటికి వెళ్లింది అక్క‌డ కూడా ఇంటికి లాక్ చేసి ఉంది…పక్కింటి వాళ్లను అడిగితే… ఇల్లు ఖాళీ చేసేశారుగా అని చెప్పారు. షాకైన ఆమె… కిటికీలోంచీ చూస్తే… ఇంట్లో ఏమీ కనిపించలేదు. దీంతో పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చింది, అత‌ని బంధువుల ద్వారా అత‌ని గురించి తెలుసుకుంటాం అంటున్నారు పోలీసులు.