భార్యను కత్తితో నరికి చంపిన భర్త….

భార్యను కత్తితో నరికి చంపిన భర్త....

0
90

అనుమానంతో భార్యను భర్త అతికిరాతకంగా కత్తితో నరికి చంపాడు ఈ సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బాలంపేటలో జరిగింది… అబ్దుల్ ఫూర్ మియా చిన్న కుమార్తె హాజీబేగం కు 13 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో ఉంటున్న సైకిల్ మెకానిక్ ఖలీంకు ఇచ్చి వివాహం చేశాడు… వీరిద్దరికి ముగ్గురు కుమారులు…

భార్య, భర్తలకు గొడవలు అవ్వడంతో హాజీ బేగం తన తండ్రి దగ్గర ఉంటోంది… అయితే రెండు రోజుల క్రితం ఖలీం తన మామ ఇంటికి వెళ్లాడు… తన ఇంటికి రావాలని భార్య కోరాడు అయితే అందుకు భార్య నిరాకరించింది… అక్రమ సంబంధం పెట్టుకుందని గొడవపడ్డాడు… దీంతో మామ అబ్దుల్ ఫూర్ నచ్చజెప్పాడు కొన్ని రోజులు ఆగితే అన్ని సర్దుకుంటాయని చెప్పాడు..

ఆరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత భార్య భర్త ఒక గదిలో, అబ్దుల్ ఫూర్ తన మనవల్లు ఒక గదిలో పడుకున్నారు.. ఉదయం నిద్ర లేచే సరికి మళ్లీ హాజీ బేగంతో గొడవపడిన ఖలీం ఆమెను కత్తితో నరికాడు దీంతో ఆమె గట్టిగాకేకలు వేయడంతో తండ్రి లోపలికి వెళ్లాడు అతన్ని కూడా చంపాడు… కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…