భార్యను మర్చిపోలేక ఆమె చున్నీతో భర్త ఉరి…..

భార్యను మర్చిపోలేక ఆమె చున్నీతో భర్త ఉరి.....

0
101

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మరిచిపోలేక భర్త ఆమె చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ సంఘటన కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… నాగవరప్పాడు కు చెందిన పెద్దపూడి శ్రీకాంత్, అనుష అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు…

కొంత కాలంపాటు వీరి కాపురం సజావుగా సాగింది… ఆతర్వాత నుంచి మనస్పర్దలు పేరిగాయి… మనస్పర్దలతో ఇంట్లో రోజు గొడవలు జరిగేవి దీంతో ఒత్తిడి తట్టుకోలేక అనుష గతంలో ఆత్మహత్య చేసుంది.. భార్య మరణంతో శ్రీకాంత్ డిప్రెషన్ లోకి వెళ్లాడు రోజు ఆమెను తలుచుకుంటే ఆమె దుస్తులను పట్టుకుని ఏడ్చేవాడు…

ఇక భార్య మరణాన్ని తట్టుకోలేక పోయిన శ్రీకాంత్ ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో భార్య చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ప్రస్తుతం ఈ సంఘటన కలకలంరేపుతోంది… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…