బెంగాల్ లో ఓ వ్యక్తి దారుణం చేశాడు, మద్యం మత్తులో పూటుగా తాగేసి ఇష్టం వచ్చినట్లు బయట ప్రవర్తించాడు… చివరకు ఇంటికి వచ్చి భార్య పై కూడా తన ప్రతాపం చూపించాడు, ఇష్టం వచ్చినట్లు ఆమెని కొట్టాడు చిత్రహింసలు పెట్టాడు, ఈ సమయంలో భార్య పడుకుని ఉండగా తన ఏడు నెలల చిన్నారిని కూడా కొట్టాడు.
చిన్నారిని కర్రలతో బెల్టుతో కొట్టడంతో ఆమె ఏడుపులు ఏడిచింది, భార్య కూడా అపస్మారక స్దితిలోకి చేరింది, దీంతో స్ధానికులు అతనిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు, భార్యని పిల్లని ఆస్పత్రికి తరలించారు, పాపకు రెండు గంటల చికిత్స తర్వాత ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.
మద్యం మత్తులో పాపని భార్యని ఏం చేస్తున్నాడో తెలియకుండా విచక్షణ లేకుండా ప్రవర్తించాడు.. దీంతో ఇంత దారుణం జరిగింది, వెంటనే అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు, అయితే ఇక్కడ వివాదానికి కారణం తను ఇంటికి వచ్చే సమయానికి భార్య నిద్రలో ఉందట, ఆ కోపంతో ఇద్దరిపై దాడి చేశాడు ఈ శాడిస్ట్ భర్త.