భార్య పిల్ల‌ల‌కు అన్నంలో విషం క‌లిపాడు వీడేం భ‌ర్త ?

భార్య పిల్ల‌ల‌కు అన్నంలో విషం క‌లిపాడు వీడేం భ‌ర్త ?

0
103

పిల్ల‌ల‌ని ఎవ‌రైనా ఎంతో ప్రేమ‌గా చూసుకుంటారు.. ఎంత భార్య‌ భ‌ర్త‌ల‌కు వివాదాలు గొడ‌వ‌లు ఉన్నా పిల్లల విష‌యంలో వారిని ఏమీ అన‌రు, ఏమి ఉన్నా వారు చూసుకుంటారు కాని ఇక్క‌డ ఓ భ‌ర్త పిల్ల‌ల పై మ‌మ‌కారం లేకుండా ప్ర‌వ‌ర్తించాడు.

తినే అన్నంలో విషం కలిపి, భార్యా పిల్లలకు ఇచ్చాడో ప్రబుద్ధుడు. మత్తిలి సమితిలో జరిగింది ఈ దుర్ఘటన శుక్రమ రాత్రి బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఏదో విషయమై అతడు తన భార్య పూర్ణమ
తో తగాదా పడ్డాడు.

త‌ర్వాత భార్య పిల్ల‌ల‌తో బాగా మాట్లాడి గొడ‌వ వ‌ద్దు అన్నాడు, అలాగే వారికి అన్నంలో విషం క‌లిపి ఇచ్చాడు, ఇక తిన్నా త‌ర్వాత వారు ప‌డుకున్నారు, త‌ర్వాత అప‌స్మార‌క స్దితిలోకి వెళ్లిపోయారు
ఆ తర్వాత అక్కడి నుంచి అతడు పరారయ్యాడు. చివ‌ర‌కు గ్రామ‌స్తులు వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు‌, వారి ప‌రిస్దితి సీరియ‌స్ గా ఉంది, భ‌ర్త‌ ప‌రారీలో ఉన్నాడు.