భార్య పొట్టిగా ఉందని మరదలిపై మోజు పడ్డ భర్త….

భార్య పొట్టిగా ఉందని మరదలిపై మోజు పడ్డ భర్త....

0
85

భార్య పొట్టిగా ఉందని అసంతృప్తికి గురి అయిన భర్త తన భార్య చెల్లెలుపై మోజు పడ్డాడు… ఆమెను పెళ్లి చేసుకోవాలని చూశాడు… అయితే భార్య అడ్డుతగలడంతో ఆమెను హత్య చేశాడు… ఈ దారుణం కర్నూల్ జిల్లా బేతంచెర్ల సమీపంలో జరిగింది.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… రవినాయక్ సుశీలాభాయి దంపతులు వీరిద్దరు గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగించేవారు…

ఈక్రమంలో రవినాయక్ తన భార్య పొట్టిగా ఉందని అసంతృప్తికిగురి అయి భార్య చెల్లెలుపై కన్నేశాడు.. ఆమెను వివాహం చేసుకోవాలని చూశాడు… అయితే ఇందుకు భార్య నో చెప్పడంతో వారిద్దరి మధ్య కొద్ది కాలంగా ఇదే విషయమై గొడవలు జరుగుతున్నాయి… మరదలి పెళ్లికి భార్య అడ్డుగా ఉందని భావించిన రవి నాయక్ ఆమెను హత్య చేయాలని ప్లాన్ వేశాడు…

ప్లాన్ ప్రకారం తానే ఆత్యహత్య చేసుకున్నట్లు సూసైడ్ లెటర్ రాయించాడు… ఆతర్వాత గొర్రెలను మేపేందుకు కొండకు వెళ్లారు అక్కడ రవి తన భార్యను బండాయితో కొట్టిచంపాడు… ఆతర్వాత ఇంటికి వచ్చిన హైడ్రామాకు తెర తీశాడు… తన భార్య ఆత్మ హత్య చేసుకుందని సూసైడ్ లెటర్ అందరికీ చూపించాడు.. వ్రైటింగ్ ఆమెదే అయినా అల్లుడిపై అనుమానంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు… దీంతో రవిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది…