అక్రమ సంబంధాలు పెట్టుకోవడంవల్ల కుటుంబాలు నాశనం అవుతాయి.. అలాగే హత్యలు ఆత్మహత్యలు వంటివి జరుగుతాయి… ప్రియుడి మోజులోపడి ప్రియురాలు… ప్రియురాలు మోజులోపడి ప్రియుడు ఏ మాత్రం ఆలోచించకుండా పరార్ అవుతున్నారు…
చివరకు వారికి పుట్టిన పిల్లలు అనాథలుగా మారుతున్నారు… తాజాగా ఇలాంటి సంఘటనే కన్యాకుమారి జిల్లా తిరువట్టార్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది… యువతికి చక్కటి ఇద్దరు పిల్లలు ఉన్నారు… తన భర్త విదేశాల్లో ఉన్నాడు… ఆమె ఓ స్కూల్ ల్లో సంగీత నృత్య ఉపాధ్యాయురాలుగా చేరింది… అదే స్కూల్ ల్లో డ్రైవర్ గా పనిచేస్తున్న అరుణ్ తో ఆమెకు పరిచయం అయింది….
ఆ పరిచయం కాస్త అక్రమసంబంధానికి దారి తీసింది… అరుణ్ కు కూడా ఇద్దరు పిల్లులు ఉన్నారు… ఇక ఆమెకు భర్త లేక పోవడంతో రోజు ఇంట్లో ఆడిందే ఆటా పాడిందే పాట అన్నట్లు ప్రవర్తించారు కొద్దిరోజులు… తర్వాత కుటుంబ సభ్యులకు తెలియడంతో మందలించారు… దీంతో వారు పరార్ అయ్యారు… ఇటీవలే పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా మరోసారి లేచిపోయారు…