భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య…

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య...

0
116

ఈ మధ్య కాలంలో హత్యలతో పాటు ఆత్మహత్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి… తల్లిదండ్రులు తిట్టారనో, లేక భార్య తిట్టిందనో లేక భర్త తిట్టారనే కారణంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు… తాజాగా ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది.. భార్య వేధిస్తోందని భర్త చెట్టుకు ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు…

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… దేవరాజుగట్టు గ్రామానికి చెందిన దావీదు అతని భార్య బాలకుమారి కలిసి ఉంటున్నారు… వీరికి కుమారుడు కుమార్తె ఉంది… కుమార్తెకు వివాహం అయింది… ఈ క్రమంలో భార్య భర్తల మధ్య గొడవ అయింది… మరుసటి రోజు చుట్టుపక్కల వారందరు ఉపాధి పనికి వెళ్లారు… దీంతో చుట్టుపక్కల ఎవ్వరు లేకపోవడంతో పెట్రోల్ బంక్ వెనకాల ఉరి వేసుకుని దావీదు ఆత్మహత్య చేసుకున్నాడు…

ఆత్మహత్య చేసుకోక ముందు తన తమ్ముడికి ఫోన్ చేసి తన కుమారుడిని నీవే జాగ్రత్తగా చూసుకోవాలని తాను చనిపోతున్నానని చెప్పాడు… దీంతో కుటుంబ సభ్యులు హుటా హుటిన ఇంటికి వెళ్లారు అప్పటికే ఆయన ఉరి వేసుకుని చనిపోయాడు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…