భార్య విషయంలో తల్లిని తిట్టిన కొడుకు చివరకు ఏమైందంటే

భార్య విషయంలో తల్లిని తిట్టిన కొడుకు చివరకు ఏమైందంటే

0
122

కుటుంబం కాపురాలు అంటే చిన్న చిన్న తగాదాలు సమస్యలు వస్తూనే ఉంటాయి, ఇలాంటి సమయాల్లో సమస్యలు వస్తే కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి, ఎవరైనా ఇందులో సెన్సిటీవ్ గా ఉంటే వారిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, లేకపోతే అసలుకే మోసం వస్తుంది, ఏదైనా అఘాయిత్యాలకు కూడా పాల్పడే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్ నగరంలో ఓ విషాదం జరిగింది.కోడలిపై తల్లి కోప్పడిందని కొడుకు మందలించడంతో తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శేరిలింగంపల్లిలో చోటుచేసుకుంది. ఓ మహిళ ఇంటి పనులు చేస్తూ ఉంటుంది, ఆమెకి కొడుకు ఉన్నాడు, అతను కారు షెడ్ లో వర్క్ చేస్తాడు.

ఈ వైరస్ నేపథ్యంలో ఇళ్లల్లో పనికి ఎవరూ రానివ్వకపోవడంతో కూరగాయలు అమ్ముకుంటోంది ఈ మహిళ. ఈ క్రమంలోనే ప్రేమ వివాహం చేసుకున్నాడు కొడుకు. గురువారం ఏదో విషయమై కోడలిపై కోప్పడింది ఈ అత్త. ఈ విషయం తెలిసిన కొడుకు తల్లిని మందలించాడు. అయితే శుక్రవారం ఉదయం ఆమె ఎంతకీ తలుపు తీయలేదు. కొడుకు తలుపు బద్దలు కొట్టి చూస్తే ఆమె ఉరి వేసుకుని మరణించింది.