మద్యం కోసం తల్లిని నరికి చంపిన కొడుకు…

మద్యం కోసం తల్లిని నరికి చంపిన కొడుకు...

0
100

ఈ దారుణం గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది… స్థానిక వృద్దురాలు తన భర్త చనిపోవడంతో కుమారుడు దగ్గర ఉంటోంది.. అతనికి భార్య నలుగురు పిల్లలు ఉన్నారు… అతనికి మద్యం అలవాటు ఉండేది… రెక్కాడితే డొక్కాడని పరిస్థితి వారిది అలాంటి పరిస్థితిలో కూడా కుమారుడు రోజు మద్యం తాగేవాడు సంపాదించినదంతా మద్యానికే పెట్టేవాడు…

తల్లి ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుని కుటుంబాన్ని పోషించేది… ఈ క్రమంలో ఆమె పనస పండ్లను అమ్మడానికి వెళ్లలేదు…. కుమారుడు మద్యం తాగడానికి డబ్బులు కావాలని తల్లిని అడిగాడు… తన దగ్గర లేవని తాను ఈరోజు పండ్లు అమ్మడానికి వెళ్లలేదని చెప్పింది…

అయినా పట్టించుకోని కుమారుడు తనకు డబ్బులు కావాలని అడిగాడు… దీంతో తల్లి కోపగించింది… ఆగ్రహించిన కుమారుడు పనస పండ్లు కోసే కత్తి తీసుకుని తల్లి మెడను కోసేశాడు… దీంతో గట్టిగా ఆమె కేకలు వేసింది భయపడిపోయిన కుమారుడు అక్కడ నుంచి పారిపోయాడు… తన కోడలితో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఆతర్వాత ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది…