విమానాశ్రయంలో విదేశీయురాలు మృతి….

విమానాశ్రయంలో విదేశీయురాలు మృతి....

0
100

సుడాన్ కు చెందిన ఒక వృద్దురాలు వైద్యం కోసం హైదరాబాద్ కు వచ్చి క్యాన్సర్ చికిత్స తీసుకుంది… ఇంటికి వెళ్లే సమయంలో గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందింది… ఈ సంఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది…

సుడాన్ దేశానికి చెందిన హెయిబా మహ్మద్ థా అలీ అనే 62 సంవత్సరాల వృద్దురాలు క్యాన్సర్ చికిత్స కోసం నగరానికి వచ్చి నిన్న తిరుగు ప్రయాణమై విమానాశ్రయానికి చేరుకుంది… వీల్ చైర్ లో బోర్డింగ్ గేటు వద్దకు వచ్చిన ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది…