మనం ఎన్నో రకాల పాముల గురించి విన్నాం.. ముఖ్యంగా అతి విషపూరిత సర్పాల గురించి అనేక వార్తలు విన్నాం.. అయితే మీకు తెలుసా మన ప్రపంచంలో అతి ఖరీదైన పాము ఏదో.. దాని నుంచి ఏమి తయారు చేస్తారో.. ఆ పాము గురించి తెలుసుకుందాం.
రెడ్ సాండ్ బోవా పాము ఇది ప్రపంచంలో చాలా అరుదుగా ఉండే పాము.. సుమారు ఇవి మన దేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి.. ఇవి మొత్తం చూసుకుంటే సుమారు రెండు వేల పాములు ఈ ప్రపంచంలో ఉంటాయి.. దీని నుంచి ఖరీదైన మెడిసన్స్ సౌందర్య సాధన ఉత్పత్తులు తయారు చేస్తారు, వీటిని చాలా మంది స్మగ్లింగ్ చేస్తారు.
ఈ అరుదైన విషరహిత పామును కొన్ని మందులు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు, ఇక వీటిని ధాయ్ లాండ్ రష్యా జర్మనీలో చాలా మంది కొంటూ ఉంటారు, చాలా ఫార్మా కంపెనీలు కొంటూ ఉంటాయి. దీని ధర ఒక్కోక్కటి సుమారు 5 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది అని చెబుతున్నారు.