ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు పనిచేస్తున్న కంపెనీ ఏదో తెలుసా

ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు పనిచేస్తున్న కంపెనీ ఏదో తెలుసా

0
90

మన ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్స్ ఎక్కడ ఉంటారు అంటే వెంటనే అమెరికా అంటాం… ఎక్కువ జీతాలు ఎవరు పొందుతున్నారు అంటే అమెరికా అని చెబుతాం….అమెజాన్ గూగుల్ ఫేస్ బుక్ అక్కడే ఉన్నాయి కాబట్టీ అక్కడ జీతాలు వారికి ఎక్కువ కాబట్టి వారే అని అనుకుంటాం… అయితే మీరు ఓ విషయం తెలుసుకోవాలి.

 

చైనాలోని ఓ కంపెనీ ఉంది ఆ కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఎంత ఇస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు… ఎందుకు అంటే ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు చాలా మంది బిలియనీర్లే…. చైనా రాజధాని బీజింగ్ లోనే అత్యధిక మంది బిలియనీర్లు ఉన్నారు.. అంతేకాదు మన ప్రపంచంలో ఉన్న బిలియనీర్లలో 100 మంది అక్కడ వారే ఉన్నారు.

 

చైనాలోని ఒక బ్యాటరీ తయారీ సంస్థలో 9 బిలియనీర్లు ఉన్నారు. చైనా సంస్థ కాంటెంపరరీ అంపెక్స్ టెక్నాలజీ ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగి ఉన్న కంపెనీగా ఉంది, అంటే ఫేస్ బుక్ అమెజాన్ గూగుల్ కంటే ఎక్కువ మంది బిలియనీర్లు ఇందులో ఉన్నారు..వోక్స్ వాగన్, బిఎమ్డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లకు బ్యాటరీలను తయారు చేస్తుందిఈ ప్రముఖ కంపెనీ.