చాలా మంది ఎంతో ఇష్టంతో జంతువులని పెంచుకుంటారు, ముఖ్యంగా కుక్కలని బాగా ఇష్టంగా పెంచుకుంటారు, తర్వాత చిలుకలని ఇష్టంగా పెంచుకుంటారు, అయితే మనిషికి ఏదైనా కష్టం వస్తే ఆ మూగ జీవాలు కూడా ఆ బాధని అర్ధం చేసుకుంటాయి, అవి కన్నీరు పెడతాయి, కుక్క ఆవు విషయంలో మనం చాలా చూసి ఉంటాం.
అయితే ఇక్కడ మనిషి ప్రాణాలను కాపాడిన మూగ జీవాలు కూడా చూశాం, తాజాగా ఓ ఘటన తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు..ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఓ ఘటన జరిగింది. అది ఏమిటి అంటే అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలు పోకుండా ఇంటి యజమానిని ఓ పెంపుడు చిలుక కాపాడింది.
ఇంట్లో ఆంటోని చాలా మత్తు నిద్రలో పడుకున్నాడు, ఈ సమయంలో ఇంటి వెనుకవైపు నుంచి పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి, వెంటనే పెంపుడు చిలుక యజమాని పేరును పదే పదే పలుకుతూ ఉంది. దీంతో నిద్రలో ఉన్న ఆంటోని ఒక్కసారిగా లేచాడు. దీంతో ఇళ్లు చుట్టు పక్కల మంటలు అంటుకున్నాయి, వెంటనే బయటపడ్డాడు, వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆపారు, ఆస్ధి నష్టం భారీగా జరిగింది, దీంతో అతని ప్రాణాలు ఆ చిలుక కాపాడింది అని అందరూ ప్రశంసించారు, ఈ వార్త పెను వైరల్ అయింది.