వ్యాపారం చేయాలనుకుంటున్నారా 10 లక్షల రుణం ఇలా పొందండి

వ్యాపారం చేయాలనుకుంటున్నారా 10 లక్షల రుణం ఇలా పొందండి

0
88

చాలా మంది ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారు, కొన్ని ఆలోచనలతో కొత్త వ్యాపారాలు చేయాలి అని చూస్తున్నారు.. అయితే ఆర్ధిక ఇబ్బందులు చాలా మందికి ఉన్నాయి… అయితే కొత్త వ్యాపారం చేయాలి అని మీరు భావిస్తున్నారా.. మీకు కేంద్రం ఓ మంచి అవకాశం ఇస్తోంది, లోన్ అందిస్తోంది మరి ఇది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

 

కేంద్రం రూ.10 లక్షల వరకు రుణం అందిస్తోంది. ముద్రా యోజన స్కీమ్ కింద ఈ రుణాలు పొందొచ్చు. మరి దీనికి ప్రాసెస్ ఏమిటి అంటే ఈ లోన్స్ మూడు రకాలుగా ఉంటాయి, మీ అర్హత, అవసరం ప్రాతిపదికన రుణం తీసుకోవచ్చు.

 

1..శిశు లోన్ కింద రూ.50 వేలు ఇస్తారు

2..కిశోర్ లోన్ కింద రూ.50 వేల నుంచి రూ.5 లక్షల లోన్ ఇస్తారు

3.. తరుణ్ లోన్ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తారు

మీరు చేసే వ్యాపారం మీరు అప్లై చేసిన దాని బట్టీ లోన్ వస్తుంది.

 

ఇక మీరు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వక్కర్లేదు, అలాగే మీరు రుణం ఐదు సంవత్సరాలలో చెల్లించాలి,

మీరు తీసుకున్న రుణానికి 12 శాతం వడ్డీ రేటు ఉండొచ్చు.

 

 

మరిన్ని వివరాల కోసం ఈ వెబ్ సైట్ చూడండి

http://www.mudra.org.in దీని ద్వారా లోన్ మీరు అప్లై చేసుకోవచ్చు.