మన భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ తో ఈ దేశాల్లో డ్రైవ్ చేయవచ్చు

You can drive in these countries with an Indian driving license

0
124

కారులో షికారు చేయాలని చాలా మందికి కోరిక ఉంటుంది. ప్రకృతి అందాలు చూస్తు డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఆ సరదా వేరు. విదేశాలలో కూడా ఈ సరదా చాలా మందికి ఉంటుంది. అయితే మన దేశంలో ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ మరే దేశంలో అయినా చెల్లుబాటు అవుతుందా? మన లైసెన్స్ తో ఏ దేశంలో అయినా కారు నడపవచ్చా అంటే కొన్ని దేశాల్లో ఆ సౌలభ్యం ఉంది. మరి ఆ దేశాలు ఏమిటి అనేది చూద్దాం.భారత్ కు చెందిన డ్రైవింగ్ లైసె ఈ పది దేశాల్లో చెల్లుబాటు అవుతుంది.

  • జర్మనీ ఈ దేశంలో మన డ్రైవింగ్ లైసెన్స్ తో డ్రైవింగ్ చేయవచ్చు. మీ లైసెన్స్ ఇంగ్లీష్ లో ఉండాలి ఈ కాపీకి.
  • బ్రిటన్ – ఏడాది పాటు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ను అనుమతి ఇస్తారు.
  • స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్ దేశాలలో సంవత్సరం పాటు మన డ్రైవింగ్ లైసెన్స్ తో తిరగవచ్చు
  • ఆస్ట్రేలియాలోనూ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ను ఆ దేశం అనుమతి ఇస్తుంది. కాని షరతులు చాలా ఉంటాయి.
  • న్యూజిలాండ్ లో కూడా వేరే దేశాల వారు వారి డ్రైవింగ్ లైసెన్స్ తో ఏడాది పాటు వెహికల్ నడవపచ్చు, అయితే టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ అవి మాత్రమే నడపాలి.
  • స్విట్జార్లాండ్-ఏడాది పాటు మన దేశ డ్రైవింగ్ లైసెన్స్ను ఉపయోగించి వాహనం నడుపుకోవచ్చు.
  • దక్షిణాఫ్రికాలో కూడా మన డ్రైవింగ్ లైసెన్స్ను అనుమతి ఉంది ఈ లైసెన్స్ కాఫీ ఇంగ్లీష్ లో ఉండాలి
  • స్వీడన్లో కూడా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్కు అనుమతి ఇస్తారు. ఈ కాపీ కూడా ఇంగ్లీష్ లో ఉండాలి
  • సింగపూర్ ఈ దేశంలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దేశమంతా చుట్టేయచ్చు. మన లైసెన్స్ ఏడాద పనిచేస్తుంది
  • హాంగ్కాంగ్ – మన లైసెన్స్ ఏడాదిపాటు పనిచేస్తుంది
  • మలేసియా మన డ్రైవింగ్ లైసెన్స్ తో ఇక్కడ తిరగవచ్చు కాని ఇక్కడ ఎంబసీ వారు దానికి ఆమోద ముద్ర ఇవ్వాలి.