యూట్యూబ్ సరికొత్త రూల్స్ కంటెంట్ క్రియేటర్స్ తప్పక తెలుసుకోండి

YouTube Newest Rules Content Creators Must Know

0
200

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఇక అందులో కచ్చితంగా యూ ట్యూబ్ చూస్తున్న వారు చాలా మంది ఉంటున్నారు. ప్రపంచంలో ప్రతీ విషయం కూడా యూ ట్యూబ్ లో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక కొత్త కంటెంట్ క్రియేటర్లు పుట్టుకు వస్తున్నారు. యాడ్ సెన్స్ తో కొత్త యూజర్లను మరింత పెంచుతోంది యూ ట్యూబ్.

ప్రతీ ఒక్కరి ట్యాలెంట్ బయటపెట్టుకునేందుకు యూట్యూబ్ మంచి వేదికగా ఉపయోగపడుతుంది. ఎంతో మంది డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఇక మనం ఎప్పుడు యూ ట్యూబ్ ఓపెన్ చేసినా అక్కడ ఫస్ట్ ప్రకటనలు కనిపిసిస్తాయి హోమ్ పేజీలో. దీని ద్వారా గూగుల్కు భారీ ఎత్తున ఆదాయం వస్తుంది.

ఈ యాడ్స్ కు సంబంధించి యూట్యూబ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూట్యూబ్ హోం పేజీలో గ్యాంబ్లింగ్, ఆల్కాహాల్, పాలిటిక్స్, డ్రగ్స్కు లింకు ఉన్నయాడ్స్ రావు, వేరే కంపెనీల ప్రకటన వస్తాయి కాని ఇలాంటి యాడ్స్ రావు.యూజర్లకు పనికొచ్చేవి, అవగాహనకు సంబంధించిన యాడ్ లు మాత్రమే ఇవ్వనున్నారు. వీడియోల్లో కీలకమైన థంబ్ నెయిల్స్ విషయంలో కూడా కఠినంగా రూల్స్ తీసుకువస్తోంది యూ ట్యూబ్.