యువకుడి కోసం బెడ్ త్యాగం చేసిన వృద్ధుడు -చివరకు విషాదం

యువకుడి కోసం బెడ్ త్యాగం చేసిన వృద్ధుడు -చివరకు విషాదం

0
82

మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగిన ఈ ఘటన కన్నీరు పెట్టిస్తోంది…యంగ్వ్యక్తి కోసం ఆసుపత్రిలో బెడ్ త్యాగం చేసిన వృద్ధుడు ఇంటికి వెళ్లిన మూడు రోజుల్లో మరణించారు. ఆర్ఎస్ఎస్ సభ్యుడైన 85 ఏండ్ల నారాయణ్ దబల్కర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే ఆయనకు ఆక్సిజన్ స్ధాయి తగ్గింది, వెంటనే ఆయనని ఆస్పత్రిలో చేర్చారు.

 

 

ఈ సమయంలో మరో వ్యక్తి భార్య తన భర్తకి బెడ్ ఇవ్వండి ఆస్పత్రిలో చేర్చుకోండి అని కోరుతోంది.. దీనిని నారాయణ చూశారు, నేను నా 85ఏళ్ల జీవితంలో అన్నీ చూశాను, ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడండి అని ఆ వ్యక్తి కోసం తన బెడ్ త్యాగం చేసుకున్నారు. ఆ దంపతుల పిల్లలు చిన్నవారని, దయచేసి తన బెడ్ను అతడికి ఇవ్వాలని కోరాడు.

 

ఆక్సిజన్ స్దాయి ఆయనకు పడిపోతుంది అని తెలిసినా ఆయన ఆ యువకుడకి బెడ్ ఇప్పించారు…

చివరి రోజుల్లో ఇంట్లో అందరితో గడపాలని ఉందని కూతురిని రప్పించారు మూడు రోజుల తర్వాత ఆయన మరణించారు.