అబ్ధుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో డ్రైవర్ గురించి నమ్మలేని నిజాలు

0
428

అబ్ధుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో ని హత్య చేయడం ఆ సమయంలో ఆమెని కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె కారు డ్రైవర్ కూడా తీవ్రగాయాల పాలై మరణించారు. దీంతో గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. తహసీల్దార్‌ విజయారెడ్డి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కామళ్ల గురునాథం వయసు 29 సంవత్సరాలు. గురునాధం చాలా మంచివాడని ఇలా అర్ధాంతరంగా మరణిస్తాడని ఎవరూ ఊహించలేదు అని కన్నీరు పెట్టారు గ్రామస్తులు.

కామళ్ల రమణమ్మ, బ్రహ్మయ్యలకు ముగ్గురు కుమారులు కాగా, అందులో పెద్దవాడు గురునాథం. నిరుపేద కుటుంబానికి చెందిన గురునాధం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తన సొంత గ్రామంలోనే చదివాడు. 2006-07లో పదో తరగతి వరకు చదివి, తర్వాత కారు డ్రైవర్ గా పనిచేసేవాడు, తర్వాత హైదరాబాద్ లో మంచి పని కోసం వెళ్లాడు. ఈ సమయంలో బాగా కష్టపడి ఇంటికి డబ్బులు పంపేవాడు, తల్లిదండ్రులని బాగా చూసుకునేవాడు.

ఈ సమయంలో విజయారెడ్డికి బాగా నమ్మకంగా ఉండటంతో ఆమె కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 4 న తన స్నేహితులతో కూడా మాట్లాడాటట, కాని గురునాధం లేడు అనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాము అంటున్నారు స్నేహితులు. ఆరవ తేదిన ఫ్రెండ్ పెళ్లికి వస్తాను అని కూడా చెప్పాడట. చిన్ననాటి స్నేహితులు నాగరాజు, సతీష్‌, అనిల్‌ తమ స్నేహితుడు ఇక లేడు అనే వార్త తట్టుకోలేకపోతున్నాము అంటున్నారు. గురునాథం భార్య సౌందర్య ప్రస్తుతం గర్భిణి కాగా, వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు.