చిన్న ఉద్యోగి అయినా పెద్ద ఉద్యోగి అయినా కచ్చితంగా ఆ ఉద్యోగంలో ఆ వ్యాపారంలో ఆ లంచ్ బాక్స్ అనేది తీసుకువెళతారు, అందులో ఉన్న ఆహరం తిని మళ్లీ తన పని తాను చేసుకుంటాడు. అయితే వారి స్దోమత బట్టీ వారికి అందులో ఆహారం ఉంటుంది. కాని ఇక్కడ ఓ వ్యక్తి తీసుకొచ్చిన లంచ్ బాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు… ఇది చూసిన వారు అందరూ కన్నీరు పెడుతున్నారు పాపం అంటున్నారు.
కొందరు ఉన్న అన్నాన్ని ఆహారాన్ని కొంచెం తిని చాలా వేస్ట్ చేస్తూ ఉంటారు… మరికొందరు ఆ అన్నం దొరక్క ఎన్నో ఇబ్బందులు పడతారు..మలేషియాకు చెందిన అపిత్ ఓ ఫోటో షేర్ చేశారు. ఇందులో సెక్యూర్టీ గార్డు డ్రెస్ ధరించిన వ్యక్తి లంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందులో ఏముంది అంటే నీటిలో కలిపిన అన్నం, ఓ ఉల్లిపాయ, మూడు వెల్లిపాయలు మాత్రమే ఉన్నాయి.
ఇక అందులో పెరుగు కూర ఇలాంటి ఆహారం ఏదీ లేదు.. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు.. పాపం అని బాధపడ్డారు, ఆ నీళ్ల అన్నం వెల్లుల్లి ఉల్లిపాయ నంచుకుని తింటున్నాడు అతను. ఈ వ్యక్తి కుటుంబానికి దూరంగా ఉండి ఆ వచ్చే జీతంలో ఎక్కువ తన కుటుంబానికి పంపి ఉన్న డబ్బులతో ఇలాంటి ఆహారం తీసుకుంటున్నాడు… నెటిజన్లు మాత్రం ఇలాంటి ఫుడ్ కాకుండా మంచి భోజనం చేయండి మీ ఆరోగ్యం జాగ్రత్త అంటున్నారు.