భారీగా పెరుగుతున్న చికెన్ ధర ఎందుకు రేట్లు పెరుగుతున్నాయంటే కారణం ఇదే

భారీగా పెరుగుతున్న చికెన్ ధర ఎందుకు రేట్లు పెరుగుతున్నాయంటే కారణం ఇదే

0
178
Pieces of raw chicken meat. Raw chicken legs in the market.
మొన్నటివరకూ కొందరు చికెన్ తినడానికి జంకారు, కాని ఇప్పుడు సమ్మర్ వచ్చినా వేడిగా ఉన్నా చికెన్ ని మాత్రం బాగా కొనుగోలు చేస్తున్నారు…చికెన్ అమ్మకాలు గతంలో కంటే భారీగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో కోడికి అమాంతం డిమాండ్ పెరుగుతోంది.  బర్డ్ ఫ్లూ భయంతో కోళ్ల బిజినెస్ దివాళా తీసింది. ఇప్పుడు మాత్రం మంచి రేంజ్ లో సాగుతోంది
పౌల్ట్రీ బిజినెస్.
అయితే  విజయవాడ, విశాఖపట్నంలాంటి నగరాల్లో బహిరంగ మార్కెట్లో చికెన్ ధర కేజీ 310 రూపాయలకు పైగానే పలుకుతోంది. ఒకేసారి ఇంత ధర పెరగడం ఏమిటి అంటే, మొన్న బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్ల పెంపకం భారీగా తగ్గింది. దీంతో పెద్దగా మార్కెట్లో కోళ్లు లేవు.
ఇప్పుడు డిమాండ్ పెరగడంతో సప్లయ్ లేక చికెన్ ధరలు పెరుగుతున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు, అయితే మరో 2 నెలల  వరకూ ఇప్పుడు చికెన్ మార్కెట్లో ఇలాగే ఉండవచ్చు అంటున్నారు, ఎందుకు అంటే ఇప్పుడు మార్కెట్ కు కోళ్లు వచ్చే సమయం కాదని ఇంకా 2 నెలల పైనే కోళ్లు భారీగా దిగుమతి అయ్యేందుకు సమయం పడుతుంది అంటున్నారు. మొన్నటి వరకూ రెస్టారెంట్లో ఆఫర్లు ఇచ్చిన వారు  ఇప్పుడు చికెన్  రేటు పెరగడంతో ఆఫర్లు తగ్గించేశారు.