15 ఏళ్ల తర్వాత..దినేష్ కార్తీక్ ధనా ధన్ ఇన్నింగ్స్

0
164

దినేష్ కార్తీక్ ప్రస్తుతం టీంఇండియాలో ప్రముఖంగా వినిపిస్తున్న ఆటగాడి పేరు. జట్టులో ఇక చోటు దక్కడమే కష్టం అనుకున్న తరుణంలో ఐపీఎల్ 2022 పుణ్యమా అని తన ఆటతో భారత జట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ 2022 కోసం ఎంపిక చేసే భారత జట్టులో డీకే స్థానం ఖాయమయ్యేలా కనిపిస్తుంది.

2006 డిసెంబర్‌ 1.. టీమ్‌ఇండియా తన మొట్టమొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ దక్షిణాఫ్రికాతో ఆడింది. అందులో రాణించిన దినేశ్‌ కార్తీక్‌ (28 బంతుల్లో 31) ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఇప్పుడు పదిహేనున్నర ఏళ్ల తర్వాత.. అదే ప్రత్యర్థితో టీ20 మ్యాచ్‌. ఇప్పుడు మళ్లీ మరింత దూకుడుతో చెలరేగిన కార్తీక్‌ జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అందుకున్నాడు.

215 ఏళ్ల తర్వాత ఈ పొట్టి ఫార్మాట్లో తన తొలి అంతర్జాతీయ అర్ధసెంచరీ అందుకోవడం విశేషం. ఇంత సుదీర్ఘ కెరీర్‌లో కార్తీక్‌ ఆడింది కేవలం 36 టీ20లే. మాజీ కెప్టెన్‌ ధోని జట్టులోకి రావడంతో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా తన స్థానం గల్లంతైంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ లో తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 1 నాటౌట్‌, 30 నాటౌట్‌, 6 పరుగుల చొప్పున చేసిన అతనికి.. నాలుగో మ్యాచ్‌లో తొలి 8 బంతుల్లో ఆరు పరుగులే చేసిన అతను.. ఆ తర్వాత రెచ్చిపోయాడు. తన చివరి 19 బంతుల్లో 49 పరుగులు సాధించాడు.  ఇదే జోరు కొనసాగిస్తే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టుకు డీకే ఎంపికయ్యే అవకాశం ఉంది.