భారత దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ మరో మైలు రాయి అందుకున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో చోటు దక్కించుకున్న అశ్విన్.. తన కెరీర్‌లో 100 టెస్టులు ఆడిన 14వ భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ , వీవీఎస్ లక్ష్మణ్, సౌరభ్ గంగూలీ, సునీల్ గవాస్కర్ , కపిల్ దేవ్, వెంగ్‌సర్కార్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, ఛటేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ మాత్రమే ఈ రికార్డు సాధించారు.
ఇక భారత్ తరఫున అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తన 24 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మొత్తం 200 టెస్టు మ్యాచులు ఆడాడు. ఆ తర్వాత ద్రవిడ్ (163), లక్ష్మణ్ (134), అనిల్ కుంబ్లే (132), కపిల్‌దేవ్ (131), సునీల్ గవాస్కర్ (125), వెంగ్‌సర్కార్(116), సౌరభ్ గంగూలీ(113), విరాట్ కోహ్లీ(113), ఇషాంత్ శర్మ(105), హర్భజన్ సింగ్, ఛటేశ్వర్ పుజార(103) ఉన్నారు.