Asia cup 2022: అందరి దృష్టి ఈ 5గురి పైనే..లిస్టులో భారత స్టార్ ప్లేయర్

0
97

ఆసియా కప్‌ లో భాగంగా ఆగస్టు 28న జరిగే భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. చాలా ఏళ్ల తర్వాత దాయాది జట్టుల మధ్య జరుగుతోన్న మ్యాచ్‌ కావడంతో క్రికెట్‌ ప్రపంచం దృష్టి ఈ మ్యాచ్‌పై పడింది. దీంతో ఇరు జట్ల ప్లేయర్‌ తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. కాగా ఈ ఐదుగురు ఆటగాళ్లపైనే ప్రధానంగా అందరి దృష్టి నెలకొంది.

దుష్మంత చమీర (శ్రీలంక): చమీరా 50 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 30.27 సగటు, 8.14 ఎకానమీతో 48 వికెట్లు తీశాడు.

భువనేశ్వర్ కుమార్ (భారతదేశం): భువీ 72 టీ20 మ్యాచ్‌ల్లో 23.44 సగటు, 6.93 ఎకానమీతో 73 వికెట్లు తీశాడు.

ముస్తాఫికర్ రెహమాన్ (బంగ్లాదేశ్): రెహమాన్ 69 టీ20 మ్యాచ్‌ల్లో 20.62 సగటు, 7.7 ఎకానమీతో 91 వికెట్లు తీశాడు.

నసీమ్ షా (పాకిస్థాన్): 19 ఏళ్ల పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షాకు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఇంకా అవకాశం రాలేదు. 13 టెస్టు మ్యాచ్‌ల్లో 36.3 సగటు, 61.73 స్ట్రైక్ రేట్‌తో 33 వికెట్లు తీశాడు.

నవీన్ ఉల్ హక్ (ఆఫ్ఘనిస్థాన్): నవీన్-ఉల్-హక్ 18 అంతర్జాతీయ టీ20ల్లో 18.04 సగటు, 7.94 ఎకానమీతో 25 వికెట్లు తీశాడు.